Shikar Dhawan: రోహిత్ పరిణితి సాధించాడు.. 1 y ago
“సారథిగా రోహిత్ ఎంతో పరిణతి సాధించాడు. ఎప్పుడు సౌమ్యంగా ఉండాలో, ఎప్పుడు సహచరులను మందలించాలో అతడికి తెలుసు. వారితో అతడికి బంధం ఏర్పడింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీతోనే తనకు, రోహిత్‌కు తొలిసారి ఓపెనింగ్ జోడీ కుదిరింది. నాతో పాటు రోహిత్ ను ఓపెనింగ్ కి దించాలన్నది ధోని ఆలోచనే. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేటప్పుడు మొదటిసారి రోహిత్ తో కలిసి కొత్త బంతిని ఎదుర్కొన్నా. ఇద్దరం సుదీర్ఘ కాలం ఓపెనర్లుగా ఆస్వాదించాం. రోహిత్ తో జూనియర్ స్థాయిలోనూ కలిసి ఆడాను. అప్పటి నుంచి మంచి స్నేహితులం" అని ధావన్ తెలిపాడు.